Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 1,249కే... సెల్‌కాన్ స్టార్ 4జీ ప్ల‌స్ ఫోన్‌!

  • ఎయిర్‌టెల్‌తో ఒప్పందం
  • 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' పేరుతో విడుద‌ల‌
  • రూ. 2,749 చెల్లిస్తే మూడేళ్ల‌లో రూ. 1500 క్యాష్‌బ్యాక్‌
ఎయిర్‌టెల్‌, సెల్‌కాన్ సంస్థ‌లు క‌లిసి సంయుక్తంగా స్టార్ 4జీ ప్ల‌స్ అనే ఎంట్రీ లెవ‌ల్ ఫీచ‌ర్‌ఫోన్‌ను ఆవిష్క‌రించాయి. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ (నా మొద‌టి స్మార్ట్‌ఫోన్‌)' పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువ‌చ్చాయి. ఏక‌మొత్తంగా దీని వాస్తవ ధ‌రను రూ. 1,249గా నిర్ణ‌యించారు. అయితే, ఈ ఫోన్‌ను కొనేటపుడు వినియోగ‌దారుడు రూ. 2,749 చెల్లించాల్సి ఉంటుంది. త‌ర్వాత‌ మూడేళ్ల కాలంలో రూ. 1500 క్యాష్‌బ్యాక్‌గా అంద‌జేస్తారు.

ఇందుకోసం 36 నెల‌ల పాటు నెల‌కు రూ. 169 చొప్పున రీఛార్జీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న వారికే మొద‌టి 18 నెల‌ల త‌ర్వాత రూ. 500, త‌ర్వాతి 18 నెల‌ల త‌ర్వాత రూ. 1000 క్యాష్‌బ్యాక్ ల‌భించ‌నుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే... 4 అంగుళాల స్క్రీన్‌, ఆండ్రాయిడ్ మార్ష్‌మెల్లో ఆప‌రేటింగ్ సిస్టం, 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ అంత‌ర్గ‌త స్టోరేజీ, డ్యూయ‌ల్ సిమ్‌, 1800 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఇందులో ఉన్నాయి.
airtel
celkon
mera pehla smartphone

More Telugu News